Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ హైకోర్టు వార్తలు

తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్!

  • తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్
  • ప్రస్తుత సీజే అలోక్ అరాథే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ
  • ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే వచ్చారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యతలు స్వీకరించారు. సుజయ్ పాల్ ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి లభించింది. 

ఇటీవల సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసులతో తెలంగాణ హైకోర్టు ప్రస్తుత సీజే అలోక్ అరాథే బదిలీ అయ్యారు. జస్టిస్ అలోక్ అరాథేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దాంతో తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ ను నియమించారు. జస్టిస్ సుజయ్ పాల్ గతేడాదే బదిలీపై తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా వచ్చారు.

Related posts

హైకోర్టులో బీఆర్ఎస్‌కు భారీ ఊరట… పాలమూరు ధర్నాకు అనుమతి…

Ram Narayana

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీల‌క ప‌రిణామం… కేటీఆర్ అరెస్టుపై కోర్టు కీల‌క ఆదేశాలు!

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసు .. శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్!

Ram Narayana

Leave a Comment