ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్.. కారణం ఇదేనా?
తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన జగదీప్ ధన్‌ఖడ్
ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
తక్షణమే అమల్లోకి రాజీనామా
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు… ఇది అత్యంత షాకింగ్ న్యూస్ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయనకు తలెత్తినప్పటికీ స్థిరంగా దృఢచిత్తమైన వ్యక్తిగా ఆయన పేరు ఉంది. అనేక విషయాల్లో ముక్కు సూటిగా వ్యవహరిస్తారని ఉండేవారు .. అయితే దేశంలోని అత్యంత రెండవ ఉన్నత పదవిగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవి ఆయన ఒక్కసారిగా త్యజించడం రాజకీయ వర్గాలను షేక్ చేసింది. అసలు ఏం జరిగింది…ఆయన ఎందుకు ఇలా చేశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆయన తన ఆరోగ్య కారణాలు వల్ల రాజీనామా చేస్తున్నానని తెలపడం షాకింగా పరిణామంగా మారింది .. నిజానికి ఉపరాష్ట్రపతిగా ఆయన వ్యవహరించిన తీరు పలువురు ప్రశంసలను అందుకున్నది. అనేక కీలక సమయాల్లో ఆయనని కచ్చితంగా వ్యవహరించారు …
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది.
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు వైద్య సలహాను పాటించడానికి తాను తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా లేఖలో వెల్లడించారు. స్థిరమైన మద్దతు మరియు సహకారం అందించారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రివర్గ సభ్యులకు వారి అమూల్యమైన సహకారం మరియు మద్దతు పట్ల ధన్‌ఖడ్ ధన్యవాదాలు తెలిపారు.
తన పదవీ కాలంలో చాలా నేర్చుకున్నానని, పార్లమెంటు సభ్యుల నుంచి తనకు లభించిన ఆప్యాయత, నమ్మకం మరియు ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆయన అన్నారు. తన పదవీ కాలంలో భారతదేశ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని చూసినందుకు ధన్‌ఖడ్ గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. “భారత్ ప్రపంచ ఖ్యాతి, అద్భుతమైన విజయాలతో నేను గర్వపడుతున్నాను. దేశం ఉజ్వల భవిష్యత్తుపై నాకు గట్టి నమ్మకం ఉంది” అని ఆయన తన వీడ్కోలు సందేశంలో తెలిపారు.
జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11 నుంచి భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా సేవలు అందించారు. అంతకుముందు, ఆయన 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. తన రాజీనామాకు ముందు, ఆయన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను రాజ్యసభ ఛైర్మన్‌గా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఆయన రాజకీయ పక్షాలను కోరారు.
రైతు కుటుంబంలో పుట్టి..
1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది.
సుప్రీంకోర్టు లాయర్
జగదీప్ ధన్కర్ రాజస్థాన్ హైకోర్టు బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.