తెలంగాణ వార్తలు

నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్..!

కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిన రియాజ్‌, ఆదివారం మరో యువకుడు ఆసిఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసిఫ్‌తో జరిగిన పెనుగులాటలో రియాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నం చేశాడు. పారిపోయే క్రమంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు రియాజ్‌ మృతిని డీజీపీ శివధర్‌రెడ్డి ధ్రువీకరించారు.

రియాజ్‌ దాడికి తెగబడ్డాడు…

రియాజ్‌ మృతిపై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. తప్పించుకొని పారిపోతూ రియాజ్‌ పోలీసులపై దాడికి దిగాడని తెలిపారు. రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, పోలీసుల దగ్గరున్న వెపన్ తీసుకుని రియాజ్‌ కాల్పులకు యత్నించాడని చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపారని, పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని అన్నారు. ఆదివారం రోజున తనను పట్టుకుంటున్న ఆసిఫ్‌ అనే వ్యక్తిపై రియాజ్‌ దాడి చేశాడని, ఇవాళ మరో కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడని చెప్పారు. బాత్రూం కోసం వెళ్లి తిరిగివస్తూ రియాజ్‌ దాడికి తెగబడ్డాడని డీజీపీ వివరించారు.

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు..! మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్..!!

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.., మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్
కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ ప్రమోద్ ను హతమార్చిన రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు.

నిజామాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను పోలీస్ కానిస్టేబుల్ గన్ గుంజుకుని ఆసుపత్రి నుండి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ..రోజే కానిస్టేబుల్ అంతక్రియలు జరిగాయి. పోలీసులు యూనిఫామ్ వేసుకొని అతని పాడే మోశారు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ కూడా జరిగింది.

ప్రజల్ని కాపాడేందుకే కాల్పులు

రౌడీషీటర్ రియాజ్ ఎన్​కౌంటర్​పై డీజీపీ శివధర్ రెడ్డి

స్పందించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఎన్​కౌంటర్​ చేసినట్లు తెలిపారు.
రౌడీషీటర్ రియాజ్ ఎన్​కౌంటర్​పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు.

తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని, అదే సమయంలో ప్రజలు కూడా ఉండడంతో వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్​కౌంటర్​ జరిపినట్లు డీజీపీ స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్​గ్రేషియా..
రౌడీ షీటర్ రియాజ్ కత్తితో దాడి చేయడంతో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్​ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమోద్ కుటుంబానికి పోలీస్​ శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్​గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. అలాగే 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు వివరించారు. అంతేకాకుండా పోలీసు భద్రతా సంక్షేమం నుంచి రూ. 16 లక్షల ఎక్స్​గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ. 8 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Related posts

కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

Ram Narayana

లక్షడప్పులు ,వేల గొంతుకలు ప్రదర్శన వాయిదా… మంద కృష్ణమాదిగ

Ram Narayana