తెలంగాణ రాజకీయ వార్తలు ..

జూబ్లీహిల్స్ లో బీజేపీకి కోలుకోలేని షాక్… డిపాజిట్ గల్లంతు

  • జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం
  • కేవలం 17,061 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
  • డిపాజిట్ కూడా రాకపోవడంతో డీలా పడ్డ బీజేపీ శ్రేణులు

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ… తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. కేవలం 17,061 ఓట్లు మాత్రమే సాధించిన దీపక్ రెడ్డి… డిపాజిట్ కోల్పోయారు. 

ఈ ఘోర ఓటమితో తెలంగాణలోని బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఓవైపు బీహార్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుండగా… తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. డిపాజిట్ కూడా గల్లంతు కావడాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

దేశంలోని ఉప ఎన్నికల ఫలితాలు ఇవే.. తెలంగాణ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్… ఒడిశా, జమ్ములో బీజేపీ

By Elections Results Congress wins in Telangana Rajasthan BJP in Odisha Jammu
  • జమ్ముకశ్మీర్‌లో ఒకచోట బీజేపీ, మరోచోట పీడీపీ విజయం
  • ఝార్ఖండ్‌లో ముక్తి మోర్చా అభ్యర్థి గెలుపు
  • పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుపు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు విజయాలు సాధించాయి.

తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జమ్ముకశ్మీర్‌లో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, ఒకచోట బీజేపీ, మరోచోట పీడీపీ గెలుపొందాయి.

రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. జమ్ము కశ్మీర్‌లోని బడ్గామ్ నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహ్దీ, నగ్రోటా నుంచి బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుపొందారు.

ఝార్ఖండ్‌లోని ఘట్సిల నియోజకవర్గంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి సోమేశ్ చంద్రసోరెన్, మిజోరాంలోని డంషా నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ లల్తాంగ్లియానా, ఒడిశాలోని నౌపడ నుంచి బీజేపీ అభ్యర్థి జై దొలాకియా, పంజాబ్‌లోని తర్ణ్ తారన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సందు గెలుపొందారు.

Related posts

బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ….6 గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి!

Ram Narayana

పునర్విభజన అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షం… ఆ రెండు పార్టీలు దూరం…

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ…

Ram Narayana