ఖమ్మం వార్తలు

సాహిత్యం ప్రజాస్వామీకరించబడాలి…ప్రొ.జయదీర్ తిరుమల రావు.

సాహిత్యం ప్రజాస్వామీకరించబడాలి,వర్గ దృక్పధం తో చరిత్ర ను స్థిరీకరణ చేయాలని ప్రఖ్యాత సాహితీ వేత్త ప్రొ.జయదీర్ తిరుమల రావు రచయితలకు పిలుపు నిచ్చారు.ఆదివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో జరిగిన ఎన్.తిర్మల్ స్వీయ కవితా సంపుటి “మట్టి పువ్వు”పుస్తకం ఆవిష్కరణ అనంతరం సభలో ప్రసంగించారు.సాహిత్యం సామాజిక వాస్తవికతను,సమతుల్యతను వ్యక్తంచేయాలని అన్నారు.స్వీయ జీవిత వచనంలో రాయడం అవసరమని అన్నారు.పాటక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాలని అన్నారు.రచయిత ప్రతి అక్షరం సమాజానికి ఉపయోగపడేలా పుస్తకాలు ఉండాలన్నారు.ప్రజాస్వామీకరించిన రచయిత స్వీయ చరిత్ర రాయకపోతే చరిత్ర కూడా వక్రీకరించబడే అవకాశం ఉందని అన్నారు.తర్జమా అంటే బాష వ్యక్తీకరణ మాత్రమేకాదుబాషను ప్రజలుకు చేరవేసే పనితనం రచయిత కుండాలన్నారు.మట్టిపువ్వు స్వీయ వచన సంపుటి తిర్మల్ కలం నుండి ప్రయోగాత్మక స్వీయ నిజ చరిత్ర గా నిలబడుతుంది అన్నారు.సెల్ పోను,ఫేస్ బుక్ లే వ్యాపకం అయిన చోట రచయితల పాత్ర అవసరం సమాజానికి చాలా ఉందని అన్నారు.తెలంగాణా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ తిర్మల్ ఉద్యమాల నుండి ఎదిగిన కవి, రచయిత,ఆయన సామాజిక ఉద్యమాలనుండి పుట్టిన రచయిత అని అన్నారు.ఎవరికి వారు జ్ఞాన సంస్కారం కలిగి ఉండాలని, ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టి జరగాలనికోరారు.సామాజిక దర్పనం గా తిర్మల్ సాహిత్యం చరిత్ర కు నిలబడుతుంది అన్నారు.అక్షరం చరిత్రకు నిలబడుతుందని అన్నారు.ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిర్మల్ మట్టిపువ్వు ఓ సామాజిక లక్ష్యం తో రాశారని, అందులో ఆయన చరిత్ర కంటే ప్రజలు అందరి చరిత్ర గా రచన కనపడుతుందన్నారు.ప్రజారచయిత జీవన్ మాట్లాడుతూ సామాజిక దర్పణంగా మట్టి పువ్వు నిలబడుతుందని అన్నారు.

ప్రముఖ కదా రచయిత హనీఫ్ అద్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ సభలోప్రొ.గూడూరి మనోజా, ప్రముఖ కవి డాక్టర్ దిలావర్, సిపిఐ యంయల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత అవునూరి మధు, సాహితీ స్రవంతి మాజీకన్వినర్ కపిల రాంకుమార్, వికాస వేదిక జిల్లా కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్, ప్రముఖ రచయిత సిహెచ్.ఆంజనేయులు,పుస్తకం రచయిత ఎన్.తిర్మల్ తదితరులు ప్రసంగించారు.సభకు ముందు ఇటీవల మరణించిన కవి అందెశ్రీ,, ఉపాద్యాయ నేత కె.నారాయణ లకు సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది.

Related posts

సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హ్యాట్సప్ …

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థి త్రిబుల్ ఆర్ కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఖమ్మంలో రోడ్ షో !

Ram Narayana

మంత్రి తుమ్మలకు శుభాకాంక్షల వెల్లువ …జనంతో కిక్కిరిసిన శ్రీసిటీ …

Ram Narayana