అంతర్జాతీయం

ఇరాన్ యుద్ధం దేశానికే కాదు ప్రపంచానికి పరీక్ష సమయం: కేంద్రం

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా పరిణామాలు మన దేశానికే కాకుండా ప్రపంచానికే పరీక్షగా మారాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు.

కువైట్ యువరాజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని జైశ్వాల్ తెలిపారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ చర్చల ఫలితంగా రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా మనదేశానికి చేరుకున్నాయని తెలిపారు.

చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు పంపిణీ చేసేందుకు గాను రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు.

Related posts

చైనాలో వరదల బీభత్సం.. పలు ప్రావిన్సులకు హై అలర్ట్!

Ram Narayana

మమ్మల్ని ఆపేదెవరు?… ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం

Ram Narayana

17వ అంతస్తు నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి…

Ram Narayana