Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ ,షర్మిల మధ్య విబేధాలు…?

జగన్ ,షర్మిల మధ్య విబేధాలు…?
-అందుకే తెలంగాణలో పార్టీ
-వద్దని వారించినా వినని చెల్లెలు
-ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం
-అవసరమైతే అన్నతో దెబ్బలాటకు రెడీ
వైయస్ కుటుంబంలో చిచ్చు రేగిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది . జగన్ , షర్మిల మధ్య విబేధాలు ఆమె తెలంగాణాలో పార్టీ  పెట్టేందుకు దారితీశాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె మామధ్య తగాదాలు లేవు  ఎవరిదారి వారిదే అంటున్నారు.  వైయస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి , అన్న వదిలిన బాణం షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానని స్పష్టం చేశారు . అన్న రాయబారాలు ఫలించలేదు. పార్టీ పెట్టేందుకే ఆమె నిర్ణయించుకున్నారని  జగన్ అంతరంగికుడు సజ్జల మాటలను బట్టి తెలుస్తుంది .  ఈ మేరకు ఆమె స్వయంగా ప్రకటించడం విశేషం. ఇందులో ఎలాంటి శషభిషలకు తావులేకుండా చేశారు.తెలంగాణాలో రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడుతున్నారు. హైద్రాబాద్ లోని ఆమె నివాసం లోటస్ పాండ్ లో  నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ముందుగా ఎంపిక చేసుకున్న కార్యకర్తల మధ్యకు  భర్త అనిల్ తో  కలిసి వచ్చారు. ఆమె వేదిక వెక్కేంత వరకు ఉన్న అనిల్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆమె చిరునవ్వుతో  అభిమానులకు అభివాదం చేశారు.  తెలంగాణాలో ప్రజలు రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారని అందుకు వైయస్సార్ అభిమానుల అభిప్రాయాలూ తీసుకుంటున్నానని మీరు కూడా మీ అభిప్రాయాలూ చెప్పమని కోరారు. జగన్ ,షర్మిల తమకు రెండు కళ్ల లాంటి వారని ,వేరువేరుగా చూడలేమని   కొందరు అభిమానులు చెప్పారు. అందుకు ఆమె జగన్ ఆంధ్రా లో ఆయన పని ఆయన చేసుకుంటారు . తెలంగాణాలో నాపని నేను చేసుకుంటానని అన్నారు. అన్న తెలంగాణాలో పార్టీ పెట్ట  వద్దని వారించినా చెల్లలు అంత సాహసం చేస్తుందా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్లాన్ లో భాగమేనని బీజేపీ అంటుంది. ఇందులో కేవీపీ రామచంద్రరావు పాత్ర ఉందని ఆరోపించింది . తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు ఎల్ వి రమణ తెలంగాణకు వ్యతిరేకం అయిన వైయస్సార్ కూతురు పార్టీ ఇక్కడ ఏముఖం పెట్టుకొని తిరుగుతుందని మండిపడ్డారు.   కాంగ్రెస్ కు చెందిన షబ్బీర్ అలీ మాత్రం పార్టీ ఏర్పాటు ఆమె ఇష్టం అన్నారు.  వైయస్ అభిమాని ఆపార్టీ కి చెందిన కొండా రాఘవరెడ్డి అవసరమైతే  తెలంగాణకోసం అన్నతో కూడా కొట్లాడతామని స్పష్ష్టం చేశారు.  ఆమె పార్టీ పెడతారని గత నెలరోజుల నుంచి బయటకు వినపడుతున్న మాట . దీనిపై ఆమె ఎప్పటినుంచో ఆలోచన చేస్తున్నారు. అన్న జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు తప్పని పరిస్థిలో ఆమె బయటకు వచ్చారు. ప్రత్యేకించి తెలంగాణ జిల్లాలో అన్న చేపట్టిన ఓదార్పు యాత్రను ఈమె కొనసాగించారు .  అన్నకు మించిన చెల్లిగా పేరుతెచ్చుకున్నారు. ఉపన్యాసాలలో క్లారిటీ , పంచ్ డైలాగులతో ప్రజలను ఆకట్టు కున్నారు.  అచ్చం వైయస్ లాగానే ఆమె అవభావాలు   ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంతే కాకుండా ప్రత్యేకించి చేయి ఊపుతున్న తీరు తండ్రిని తలపిస్తుందని భావన ఉంది. షర్మిల పార్టీ పేరు జెండా ఇంకా ఖరారు కాలేదు. వైయస్సార్ తెలంగాణ పార్టీ, లేదా రాజన్న రాజ్యం అనేపేర్లతో ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకుంటున్నారని సమాచారం . నల్లగొండ నేతలతో ప్రారంభమైన సమావేశాలు వరసగా ఉమ్మడి పది జిల్లాల నేతలతో ఉంటుందని తెలుస్తుంది . తెలంగాణాలో షర్మిల పార్టీ కి అవకాశం ఉంటుందా ? లేదా అనేది చూడాలి మరి !!!
 

Related posts

ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి!

Drukpadam

వైసీపీకి మింగుడు పడని నెల్లూరు జిల్లా రాజకీయాలు …!

Drukpadam

ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే నోటిఫికేషన్లు ఇస్తారు :షర్మిల

Drukpadam

Leave a Comment