రెండున్నరేళ్లుగా గంజాయి వ్యాపారం బంద్ అయ్యే సరికి అయ్యన్న అరుస్తున్నాడు: వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు…
-కుమారుడితో కలిసి గంజాయి వ్యాపారం
-ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన గురించి నీచంగా మాట్లాడతారు
-పేరులోనే అన్నం.. నోట్లో అంతా అశుద్ధమే
-ఆయన్ను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని మండిపాటు
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, టీజేఆర్ సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొద్దున లేస్తే చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చేసేది గంజాయి వ్యాపారమని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా ఆ వ్యాపారం బంద్ అయ్యేసరికి వారిద్దరూ గాడిదల్లా అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ సంస్మరణ సభ సందర్భంగా సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వారు ఈ విమర్శలు చేశారు.
అయ్యన్నపాత్రుడి పేరులో అన్నం ఉందిగానీ.. నోట్లో అంతా అశుద్ధమేనని, ఇకపై ఆయన్ను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని అన్నారు. ఆయన గురించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నీచంగా చెబుతారన్నారు. చంద్రబాబు హయాంలో అయన్నపాత్రుడు కోట్లాది రూపాయల ప్రజధనాన్ని దోచుకున్నారని, చంద్రబాబు అవినీతిని బయటపెడుతున్నందుకే ప్రభుత్వంపై దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబు కారణమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా ఈ విషయంపై కోడై కూస్తున్నారని అన్నారు. అయన్న తిట్టాల్సింది చంద్రబాబు, లోకేశ్ నని అన్నారు. హైకోర్టు తన తీర్పుతో బాబు, లోకేశ్ లను లెంపకాయ కొట్టిందన్నారు.
-చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు, గూండాలు కలిసి దాడి చేశారు: జోగి రమేశ్
-అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
-చంద్రబాబును, లోకేశ్ ను ఏపీలో తిరగనివ్వబోమని హెచ్చరిక
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై జోగి రమేశ్ స్పందిస్తూ… తమ ఆరాధ్య దైవం జగన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు సిగ్గులేదని… అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేయడానికి వచ్చిన తమపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. గూండాలు, చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కలిసి దాడికి పాల్పడ్డారని అన్నారు.
ఇంట్లో పడుకోవడం కాదు చంద్రబాబూ… దమ్ముంటే బయటకు రా.. మా సత్తా ఏమిటో చూపిస్తామని జోగి రమేశ్ సవాల్ విసిరారు. నిన్ను, నీ కొడుకుని ఏపీలో తిరగనివ్వమని అన్నారు. తాము సభ్యత మరిచి ఎప్పుడూ మాట్లాడలేదని… టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.