Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కెనడా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ….విమానాలపై నిషేధం తొలగింపు !

కెనడా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ….విమానాలపై నిషేధం తొలగింపు !
-భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తేసిన కెనడా
-భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మొదలైన్ బ్యాన్
-సెప్టెంబరు 27 నుంచి ప్యాసింజర్ విమానాలకు అనుమతి
-ప్రయాణానికి 18 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాలని నిబంధన

ఐదు నెలల సుదీర్ఘ నిషేధం తరువాత కెనడా ప్రభత్వం భారత్ నుంచి వచ్చే విమానాలకు పచ్చ జెండా ఊపింది. ఈ నెల 27 నుంచి భారత్ నుంచి కెనడా కు విమానాల రాకపోకలు యధావిధిగా జరుగుతాయి. కరోనా నేపథ్యంలో కెనడా ప్రభత్వం భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన సంగతి విదితమే . అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కెనడా కు భారత్ నుంచి విద్యార్థులు క్యూ కట్టారు. గతంలో అమెరికా కు వెళ్లే వారంతా కెనడా ను తమ చదువులకు కేంద్రం గా ఎంచుకుంటున్నారు. దీంతో భారత్ -కెనడా లమధ్య విమానాల నిషేధం తో కెనడాకు వెళ్లేవారు నానారకాల ఇబ్బందులు పడ్డారు. వయా మాల్దీవులు , మలేషియా , దుబాయ్ , అబు దాబి , లనుంచి కెనడా చేరుకునే వారు . మధ్యలో కరోనా టెస్టులు , హాల్టింగ్ లతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నేరుగా భారత్ నుంచి కెనడాకు విమానాలు ఉండటంతో భారత్ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 27 నుంచి నిషేధం ఎత్తేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ నిషేధాన్ని కెనడా అమలు చేసింది. అప్పటి నుంచి ఐదు నెలలపాటు ఈ బ్యాన్ కొనసాగింది. ఇప్పుడు తాజాగా దీన్ని తొలగిస్తున్నట్లు కెనడా తెలిపింది.

అయితే భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అనుమతి పొందిన ల్యాబొరేటరీల నుంచి కరోనా నెగిటివ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని కెనడా సూచించింది. ఈ పరీక్షలను ప్రయాణానికి 18 గంటల ముందు చేయించుకోవాలని చెప్పింది. కాగా, భారత్ నుంచి మూడు విమానాల్లో కెనడా చేరిన ప్రయాణికులు అందరూ కరోనా నెగిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

Related posts

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి!

Drukpadam

మాస్క్ కు బై బై …హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయం …

Drukpadam

ట్రైనీ ఐఏఎస్ అధికారుల్లో .. 84 మందికి పాజిటివ్!

Drukpadam

Leave a Comment