Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దొరకని మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు… ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు

  • రెండ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన బాబు
  • నిన్న రాష్ట్రపతితో భేటీ
  • ఏపీ పరిస్థితులపై నివేదన
  • నేడు మోదీ, అమిత్ షాలను కలవాలని భావించిన వైనం

ఏపీలో రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాల్లో సగమే నెరవేరాయి. నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి పలు అంశాలపై నివేదించిన చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు… నేడు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలవాలని భావించారు. అయితే, మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో నిరాశకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్ దొరికాక మరోసారి ఢిల్లీ వెళతారని తెలుస్తోంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతితో సమావేశం సందర్భంగా ఇదే అంశాన్ని ఆయన ముందుంచారు.

Related posts

ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ సుడాన్‌లోని భారతీయులకు హెచ్చరిక!

Drukpadam

పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు ఇస్తారా?.. మీరు జైలుకు వెళ్తారా?: ఏపీ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం

Drukpadam

భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ..ఘనస్వాగతం పలికి మంత్రులు పువ్వాడ ,సత్యవతి రాథోడ్ …

Drukpadam

Leave a Comment