- నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ ఉగ్రవాద సంస్థ చీఫ్ గురుపత్వంత్ పన్నున్ వార్నింగ్
- హమాస్ తరహా దాడి జరిగితే బాధ్యత మోదీదేనని హెచ్చరిక
- ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల నుంచి మోదీ గుణపాఠం నేర్చుకోవాలని సూచన
- త్వరలో పంజాబ్‌కు విముక్తి కలుగుతుందంటూ ప్రకటన
కెనడాను అడ్డంపెట్టుకుని రెచ్చిపోతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నాడు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నుంచి ప్రధాని మోదీ గుణపాఠం నేర్చుకోవాలని హెచ్చరిస్తూ ఆన్‌లైన్‌లో ఓ వీడియో విడుదల చేశాడు. లేని పక్షంలో భారత్‌పై హమాస్ తరహా దాడులు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్‌కు పన్నున్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
‘‘పంజాబ్ నుంచి పాలస్తీనా వరకూ ఆక్రమణకు గురైన వారందరూ ప్రతిఘటిస్తారు. హింస మరింత హింసకు దారి తీస్తుంది’’ అంటూ గురుపత్వంత్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. పంజాబ్‌ను భారత్ మరింత కాలంపాటు తన అధీనంలో ఉంచుకుంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దీనికి మోదీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ ‘బ్యాలెట్-ఓటు’ను నమ్ముతుందంటూనే త్వరలోనే పంజాబ్‌కు విముక్తి లభిస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. బ్యాలెట్ కావాలో బుల్లెట్ కావాలో తేల్చుకోమని వార్నింగ్ ఇచ్చాడు.