Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

 నేనెక్కడికీ పారిపోలేదు… మా ఇంట్లోనే ఉన్నా: ‘బిగ్ బాస్’ విజేత పల్లవి ప్రశాంత్

  • ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్-7
  • విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్
  • గ్రాండ్ ఫినాలే అనంతరం గొడవలు
  • కేసు నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పరారీ అంటూ వార్తలు
  • తాజాగా వీడియో విడుదల చేసిన పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడన్న మాటే కానీ, వివాదాలతోనే సరిపోతోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిశాక జరిగిన గొడవల నేపథ్యంలో అతడిపైనా కేసు నమోదైంది. దాంతో, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని, అతడి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారని ఈ ఉదయం నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, పల్లవి ప్రశాంత్ ఓ వీడియో విడుదల చేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తాను ఇంట్లోనే ఉన్నానని వెల్లడించాడు. తన గురించి మీడియాలో వస్తున్నదంతా తప్పుడు సమాచారం అని పల్లవి ప్రశాంత్ స్పష్టం చేశాడు. 

తాను ఏ తప్పు చేయలేదని, ఇతరులు చేసినవి తనపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అప్రదిష్ఠ పాల్జేసేందుకే ఇలాంటివన్నీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. తాను బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఫోన్ జోలికే వెళ్లలేదని, అది స్విచాఫ్ లోనే ఉందని వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు.

Related posts

రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, జాబ్ క్యాలెండర్‌పై ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క వివరణ…

Ram Narayana

రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగేలేటి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళుతున్న ఫ్లైట్ కు సాంకేతిక లోపం …

Ram Narayana

ఈ నెల 28 నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరిస్తాం: పొంగులేటి

Ram Narayana

Leave a Comment