Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నింగిలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ వలయం!

  • -తెలంగాణలో పలుచోట్ల ఆవిష్కృతమైన దృశ్యం
  • -మంచు బిందువులపై సూర్యకిరణాలు పరావర్తనం చెందడమే కారణమన్న ఖగోళ నిపుణులు
  • -వీటిని 22-డిగ్రీ హలోస్ అంటారన్న బిర్లా ప్లానెటోరియం అధికారులు

తెలంగాణలో పలుచోట్ల ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమయింది. సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా వలయం కనిపించింది. హైదరారాబాద్, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ సహా పలుచోట్ల ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీన్ని చూసి ప్రజలు అబ్బురపడ్డారు. తమ సెల్ ఫోన్లలో దృశ్యాన్ని బంధించారు.

దీనిపై ఖగోళశాస్త్ర నిపుణులు మాట్లాడుతూ, దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో ఘనీభవించిన నీటి బిందువులు ఉంటాయని… వాటిపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. మంచు బిందువులపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఇంద్రధనుస్సు రంగుల్లో కనిపిస్తాయని తెలిపారు.

మరోవైపు, సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ ఇలాంటి వలయాకారాలు (వరదగుడి, వరదగూడు అని కూడా అంటారు) ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచికగా భావించవచ్చని చెప్పారు. ఇలాంటి వలయాలు ఏర్పడటం అశుభమంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను బిర్లా ప్లానెటోరియం అధికారులు ఖండించారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని 22-డిగ్రీ హలోస్ అంటారని చెప్పారు. ఈ వలయాలకు సుమారు 22 డిగ్రీల వ్యాసార్ధం ఉంటుందని అన్నారు.

Related posts

కెనడా వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఆపసోపాలు….

Drukpadam

తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం… ఎంత పెద్దదో!

Drukpadam

భారతీయ విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్!

Drukpadam

Leave a Comment