భరతమాత ముద్దుబిడ్డ ,మార్క్సిస్ట్ మేధావి సీతారాం ఏచూరి ! ఎస్ వీరయ్య
బహుముఖ ప్రజ్ఞాశాలి …ఆకట్టుకునే ఆయన ప్రసంగాలు
ఉత్తమ పార్లమెంటేరియన్ ,బడుగు బలహీనవర్గాల ప్రతినిధి
ఎస్ ఎఫ్ ఐ పూర్వ విద్యార్థుల ఆధ్వరంలో ఖమ్మంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ
భరతమాత ముద్దుబిడ్డ ,మార్క్సిస్ట్ మేధావి సీతారాం ఏచూరి మరణం దేశానికి ,ప్రపంచ పురోగామి శక్తులకు,ప్రధానంగా ,యువజన విద్యార్ధి ఉద్యమాలకు తీరని లోటని ఉమ్మడి రాష్ట్ర ఎస్ ఎఫ్ ఐ మాజీ అధ్యక్షులు ఎస్ వీరయ్య అన్నారు …ఎస్ ఎఫ్ ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలోని మంచికంటి హాల్ లో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు …ఈసందర్భంగా ఆయన ఆలోచనలను ,పోరాటపటిమను ,స్మరించుకున్నారు..ఉత్తమపార్లమెంటేరియన్ గా ,ఆయన ప్రసంగాలు ఆలోచింపచేసివిగా ఉండేవని అన్నారు ..ఆయన జీవిత చరమాంకం వరకు జ్వాస , శ్వాస అన్నిదేశంలో బడుగు బలహీన వర్గాల కోసమేనన్నారు ..
. సీతారాం ఏచూరి ఒక వ్యక్తి కాదు శక్తి లోతైన అధ్యయనం ,విశ్లేషణలు ప్రజాఉద్యమాలకు మార్గదర్శనంగా ఉండేవని అన్నారు ..ఆయన ఇచ్చిన “అధ్యయనం – పోరాటం” నినాదం ఈ నాటి విద్యార్థి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని , “చదువుతూ పోరాడు-చదువుకై పోరాడు” నినాదం కూడా ఏచూరి ఇచ్చినదేనని వీరయ్య గుర్తు చేశారు . అందరికీ విద్య అందరికీ ఉద్యోగం లక్ష్యం అనే నినాదం అన్ని వర్గాల మన్ననలను అందుకుందన్నారు . విద్యార్థి సమ్మెల యెడల ఏచూరి చేసిన దిశా నిర్దేశం విద్యార్థి సంఘాలకు మార్గ దర్శకంగా నిలిచిందన్నారు . అత్యంత ప్రతిభావంతుడైన ఏచూరి ఎర్ర జెండాయే నా మార్గం అని నమ్మి విప్లవ మార్గం పట్టాడు. ఎన్నో ప్రతిభా పాటవలు ఉన్నా తన స్వంత ప్రయోజనం మాని మార్క్సిజం లెనినిజం వెలుగులో సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ దుష్ఫలితాలు తన కలాన్ని, గళాన్ని ఉపయోగించారన్నారు . ఆర్థిక సరళీకరణ దుష్పలితాలపై మరిన్ని పోరాటాలు జరగలిసిన తరుణంలో సీతారాం పోరాటం లేని లోటు తీరనిదన్నారు . సుందరయ్య ప్రియ శిష్యులలో ఒకరైన ఏచూరి భారతీయ తత్వ శాస్త్రాన్ని, అర్ధశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఈ దేశ ప్రజలకు భారతీయతను అన్వయించి భారతీయ తరహా సోషలిజంను ఆయన ఉద్బోధించారు. అత్యంత మేథా సంపన్నుడైన ఏచూరి జీవితం ఈనాటి యువతరానికి ఆదర్శం. అలాంటి సీతారాం ఏచూరీ లు మన యువతరానికి ఈనాడు అవసరం. కులం మతం యొక్క పెడదోరణులపై పోరాటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో గతంలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం లో పని చేసి ఇప్పుడు వివిధ రంగాలలో స్థిరపడిన అనేకమంది ప్రముఖులు అత్యధికంగా పాల్గొన్నారు.సభకు ఎస్ ఎఫ్ ఐ పూర్వవిద్యార్థుల జిల్లా కన్వీనర్ ఎం సుబ్బారావు అధ్యక్షత వహించారు. తొలుత ఎల్ వి రావు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. అద్దంకి విప్లవ కుమార్ వందన సమర్పణ చేశారు.