అంతర్జాతీయం

అమెరికాపై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్న యూఎస్ ఇంటెలిజెన్స్!

  • వెయ్యి రోజులు దాటిన రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
  • ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం
  • సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలన్న ఇంటెలిజెన్స్

రష్యా – ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం వెయ్యి రోజులు దాటింది. యుద్ధ తీవ్రత తగ్గకపోగా… యుద్ధం అణుయుద్ధంగా కూడా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నిబంధనలను సరళతరం చేసే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. మరోవైపు అమెరికాపై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ ఇంటెలిజెన్స్ అలెర్ట్ చేసింది. 

అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న డిఫెన్స్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలని సూచించింది.

Related posts

పుతిన్‌తో ట్రంప్ చర్చలు.. గంటల వ్యవధిలోనే కీవ్‌పై రష్యా భీకర దాడి..!

Ram Narayana

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు …మొత్తం బంగారం తో నిర్మాణం రూ.2,550 కోట్ల విలువైన ఇల్లు..

Ram Narayana

పిల్లల సామాజిక మాధ్యమం వాడకంపై ఫ్రాన్స్ కీలక నిర్ణయం దిశగా అడుగులు

Ram Narayana