ఖమ్మం వార్తలు

నల్లగొండకు తరలి వెళ్లిన సిపిఐ శ్రేణులు

నల్లగొండకు తరలి వెళ్లిన సిపిఐ శ్రేణులు

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత వసంత ప్రారంభ సభ సోమవారం నల్లగొండలో జరగగా ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో సిపిఐ శ్రేణులు తరలి వెళ్లారు. బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ర్యాలీగా నల్గగొండకు వెళ్లారు. సిపిఐ కార్యాలయం ఎదుట ర్యాలీని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ ఖమ్మంజిల్లాలోని అన్ని మండలాల నుంచి సిపిఐ కార్యకర్తలు నల్లగొండకు తరలి వెళ్తున్నారని రెండువేల మందిని తరలించే లక్ష్యంతో వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నల్లగొండ సభ తర్వాత ఖమ్మంజిల్లాలో మండలాలు, గ్రామ స్థాయిలో శత వసంత సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఎస్కె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Related posts

SFI Former Students Meet Grand Success in Khammam…

Ram Narayana

సామినేని రామారావు హత్యకు భట్టినే భాద్యత వహించాలి…సిపిఎం

Ram Narayana

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఖమ్మం వర్తకుల వినతి

Ram Narayana