Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఇండియా కూటమి కేజ్రీవాల్ కు సహకరించాలి: శరద్ పవార్

  • ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోని కాంగ్రెస్, ఆప్
  • కూటమిలోని పార్టీలు కేజ్రీవాల్ కు మద్దతుగా నిలవాలన్న శరద్ పవార్
  • కూటమి జాతీయ స్థాయిలో మాత్రమే కలసికట్టుగా పని చేస్తోందని వ్యాఖ్య

ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. అధికారాన్ని నిలుపుకోవాలని ఆప్, ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కేజ్రీవాల్ కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.  

ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మాత్రమే కలసికట్టుగా పని చేస్తోందని… రాష్ట్రాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇప్పటి వరకు చర్చ జరగలేదని శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలా? లేక కలసి పోటీ చేయాలా? అనేది చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రానున్న 8 – 10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

Related posts

అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాడాల్సిందే …మోహన్ భగత్ …

Ram Narayana

మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రత, అభివృద్దికి గ్యారంటీ: పాలమూరు సభలో ప్రధాని మోదీ!

Ram Narayana

ఇందిరాగాంధీని కూడా కేసీఆర్ తిడుతున్నారు: మల్లికార్జున ఖర్గే ఆవేదన

Ram Narayana

Leave a Comment