Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

నీటివాటా పాపం బీఆర్ యస్ దే…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి …

తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీల నీటిని వాడుకునేలా బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంది

  • బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపణ
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కృష్ణా జలాల్లో 70 శాతం వాటా వాదనను లేవనెత్తామన్న మంత్రి
  • రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణపై బీఆర్ఎస్ మాట్లాడలేదని విమర్శ

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నీటి వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పాపం బీఆర్ఎస్‌దే అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసుకున్న చీకటి ఒప్పందంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తాత్కాలిక కేటాయింపులపై ప్రతి సంవత్సరం సంతకాలు చేసిందే వాళ్లు అని ఆరోపించారు. కానీ కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలనే వాదనను లేవనెత్తింది తమ కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంలో బీఆర్ఎస్ గొప్పతనమేమీ లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ద్వారా త్వరగా నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించిందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని కూడా అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఏపీ అనుమతులు జారీ చేసిన సమయంలో బీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు.

Related posts

డిప్యూటీ సీఎంకు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు…

Ram Narayana

కేవీపీకి కౌంటర్ ఇచ్చిన వీహెచ్

Ram Narayana

షర్మిల, రేవంత్‌రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే: జగన్

Ram Narayana

Leave a Comment