టీయూ డబ్ల్యూ జె (ఐజేయు) డైరీ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యూ జే -ఐ జే యు )డైరీ ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం, సమస్యల కోసం పోరాడుతున్న యూనియన్ పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు ,స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, ఉపాధ్యక్షులు మైసా పాపారావు ,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఉపాధ్యక్షులు మామిడాల భూపాలరావు, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు మైనుద్దీన్ ,నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, జనార్ధన చారి,కళ్యాణ్, సత్యనారాయణ, మేడి రమేష్, బుర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
