బస్సు డిపో రోడ్ 100 అడుగుల రోడ్ గా వెడల్పు చేయాలి… సిపిఎం నేత విక్రమ్
డివైడర్ లు తొలిగిస్తే సమస్య పరిష్కారం కాదు…
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకండి –
మంత్రి తుమ్మల వెంటనే జోక్యం చేసుకోవాలి
లేకపోతె సమస్య మరింత జఠిలమవుతుంది …
ఖమ్మంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే బస్సు డిపో రోడ్ లో ఉన్న డివైడర్లు తొలగిస్తే సమస్య పరిస్కారం కాదని అది మరింత జఠిలమవుతుందని దాన్ని ప్రజల ఉపయోగార్థం 100 అడుగుల రోడ్ గా మార్చాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి వై .విక్రమ్ డిమాండ్ చేశారు …ఇటీవల మంత్రి తుమ్మలను కలిసిన సందర్భంగా కూడా ఈ విషయాన్నీ చెప్పమని అన్నారు …గత ప్రభుత్వం చేసిన తప్పులని మీరు చేయవద్దని హితవు పలికారు ..
సరైన శాస్త్రీయత లేకుండా కాంట్రాక్టర్ ల కోసం అనాటి ప్రభుత్వం బస్సు డిపో రోడ్ లో డివైడర్ లు కట్టి డిపో రోడ్ ను అస్తవ్యస్తంగా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బస్సు డిపో రోడ్ ను 100 అడుగుల రోడ్ గా విస్తరణ చేయాలని సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో డిపో రోడ్ ను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా డిపో రోడ్ లో డివైడర్ లను తొలిగించిన రోడ్ ను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ పార్టీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని డిపో రోడ్ ను వెడల్పు చేయాలని ఆందోళనలు చేసామని తెలిపారు. నూతన బస్టాండ్ బైపాస్ రోడ్ వైపు రావడం ఫలితంగా డిపో రోడ్ లో ట్రాఫిక్ బాగా పెరిగి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని, డిపో రోడ్ లో చిన్న వెహికల్ ఆగినా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ వెడల్పు చేయకుండా కాంట్రాక్టర్ ల లాభాలు కోసం కేవలం ఎటువంటి శాస్త్రీయత లేకుండా, డివైడర్ లు మాత్రమే నిర్మించి ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేశారని విమర్శించారు. ఇప్పుడు జిల్లా మంత్రి జోక్యం చేసుకుని భవిష్యత్తు ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని 100 అడుగుల రోడ్ గా వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం అధికారులు డివైడర్ లు మాత్రమే తొలిగిస్తే సమస్య పరిష్కారం కాదు అని స్పష్టం చేశారు. రోడ్ వెడల్పు చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టి.విష్ణు వర్ధన్, నాయకులు భుక్యా ఉపేంద్ర, జె వెంకన్న బాబు, హుస్సేన్, నాగేశ్వరరావు, ఏటా రాజేష్, మల్లికార్జున్ రెడ్డి, గుమ్మడి బిక్షం, వినోద్ , షఫీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు…