Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఎయిర్ అంబులెన్సులో హుటాహుటిన కొడాలి నాని ముంబైకి తరలింపు…

  • ఈ నెల 26న గుండెపోటుకు గురైన కొడాలి నాని 
  • కొడాలి నానికి మూసుకుపోయిన మూడు వాల్వ్స్
  • క్రిటికల్ సర్జరీ చేయాలన్న ఏఐజీ ఆసుపత్రి వైద్యులు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నెల 26న కొడాలి నాని హైదరాబాద్ లోని నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి నాని ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 

నానికి మూడు వాల్వ్స్ మూసుకుపోయాయని కాసేపటి క్రితం వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు. క్రిటికల్ సర్జరీ చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో, ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 

ఈ క్రమంలో, సమయం వృథా చేయకుండా ఆయనను హుటాహుటిన ముంబైకి తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా కొడాలి నానిని లిఫ్ట్ చేశారు. ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్ లో ఏఐజీ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు కూడా బయల్దేరారు. కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు, వైసీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నానికి బైపాస్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

Related posts

మృతదేహాన్ని ఖననం చేసిన 24 గంటల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి…

Drukpadam

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా నేరం కాదు..షరతులు వర్తిస్తాయ్: నితిన్ గడ్కరీ!

Drukpadam

ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ముస్లిం మహిళ.. ఫత్వా జారీ!

Drukpadam

Leave a Comment