Mallu Bhatti Vikramaarka
ఖమ్మం వార్తలుతెలంగాణ వార్తలు

వైరా గర్ల్స్ రెసిడెన్షియల్  పాఠశాలను …

ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి

  • ఎలా ఉన్నారు ? బాగా చదువుకుంటున్నారంటూ మాటా మంతీ
  • బోధన తీరు, మెస్ నిర్వహణ, మెనూ మెయింటినెన్స్, వసతులపై ఆరా  
  • పాఠశాల విద్యార్థినులందరితో  కలసి భట్టి భోజనం

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి హాజరై తిరిగి వస్తూ ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వైరా నియోజక వర్గ కేంద్రంలోని మహిళా రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మొదట పాఠశాల విద్యార్థినిలతో సమావేశమయ్యారు. రాత్రి వేళ హాస్టల్లో ఎవరు డ్యూటీ చేస్తారు.? వారు ఎక్కడ పడుకుంటారు ? డిన్నర్ టైమింగ్స్ ఏంటి ?  హాస్టల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటూ పలు అంశాలపై ఆరా తీశారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్ వరకు ఉంది కదా ? రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి ? ఇంటర్ పూర్తి చేసిన వారు ఎటు వైపు వెళుతున్నారు ? మెడిసిన్ వైపు ఎంత మంది ? ఇంజనీరింగ్ సైడ్ ఎంత మంది వెళ్లారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం నలుగురు మెడిసిన్ కు ఎంపికైనట్టు సిబ్బంది తెలిపారు. మిగిలిన వారు ఇంజనీరింగ్ వైపు వెళ్లినట్టు చెప్పారు. మీ కళాశాల నుంచి బయటికి వెళ్లిన విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నారా ? విద్యార్థినిల సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూమ్స్ ఉన్నాయా ? ప్రతి క్లాస్కు ఎన్ని సెక్షన్లు ఉన్నాయని మరి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత ఎవరైనా మాట్లాడుతారా ? అంటూ, విద్యార్థినిలను ఒక్కొక్కరుగా పిలిచి భవిష్యత్తులో ఏ వృత్తిలో స్థిర పడాలనుకుంటున్నారని అడిగారు. వారి తరగతి. తల్లిదండ్రుల వివరాలను, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్దినులు దివ్య డాక్టర్, ప్రణవి కలెక్టర్, జోష్ణ పోలీస్ అధికారి కావాలనుకుంటున్నట్లు భట్టికి తెలిపారు. అనంతరం డిన్నర్ రెడీగా ఉందా ? అంతా కలిసి భోజనం చేద్దాం, పదండి అంటూ పిల్లలను వెంటపెట్టుకొని డిప్యూటీ సీఎం వారితో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత ఎలా ఉంది ? మెనూ పాటిస్తున్నారా ? అంటూ విద్యార్థినులను ప్రశ్నించారు. భోజనం బాగుంటుందని, మెనూ పాటిస్తున్నారని విద్యార్థినులు సమాధానం ఇచ్చారు. మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారంటూ ఆరా తీసి, ఫ్లెక్సీ దగ్గరకు వెళ్లి మెనూ చార్ట్ ను పరిశీలించారు. వసతులు, ఇబ్బందుల గురించి టీచింగ్ స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు.

Related posts

విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు…. మంత్రి తుమ్మల

Ram Narayana

వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలి. కూనంనేని

Ram Narayana

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదు…తమ్మినేని

Ram Narayana