Revanth Reddy
తెలంగాణ వార్తలు

పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని … మమ్మల్ని తెలంగాణ ద్రోహులంటారా ?

  • ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్న రేవంత్
  • ఫాంహౌస్‌కే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు
  • కాళేశ్వరం, రుణమాఫీ, ఉద్యోగాలపై చర్చకు రావాలని సవాల్

పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా? అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గత పదేళ్లలో తెలంగాణను ‘కోతుల గుంపు’ చేతికి ఇచ్చినట్లు అయిందని వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఫాంహౌస్‌కే పరిమితమై ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని దుయ్య బట్టారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదని రేవంత్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఏ పథకాన్ని ఆపలేదని, ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా? అధికారం లేకపోతే బాధ్యతలను గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలుంటే చెప్పాలని, అంతేకానీ నిరాధార విమర్శలు చేయవద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం వచ్చే పదేళ్లూ అధికారంలో ఉంటుందని, కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవుతారని జోస్యం చెప్పారు.

Related posts

నల్ల బ్యాడ్జీలతో రంజాన్ ప్రార్థనలు చేసిన ముస్లింలు!

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘రాధాకిషన్‌రావు బ్యాచ్’ దారుణం మరోటి వెలుగులోకి..!

Ram Narayana

గాంధీ హాస్పటల్ వద్ద ఉద్రిక్తత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్?

Ram Narayana