తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణాలో మంత్రుల శాఖల మారిస్తే అధిష్టానానికి తలనొప్పే నా …!

కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ ఒక సమస్యకాగ ,మంత్రుల శాఖల మార్పు తలనొప్పిగా మారుతుందా …! అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు … పైకి అంతా మంచిగానే కనిపిస్తున్నా మేడిపండు చందమె అంటున్నారు …ఎవరి మనసులో వారు పగలు ప్రతీకారాలతో బొడ్లో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి …ఒకరిపై ఒకరు ఫిర్యాదులు , లేఖలు రాయడం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది …తమకున్న ఫీడ్ బ్యాక్ తో మంత్రివర్గంలో మార్పులు చేయాలనీ శాఖలను మార్చాలని పార్టీ తలచింది …కొందరు మంత్రుల దగ్గర ఉన్న రెండు మూడు శాఖలను తప్పించి మరి కొందరికి ప్రాధాన్యతగల శాఖలు ఇవ్వాలని ఆలోచన చేసినట్లు సమాచారం …ఆమేరకు కసరత్తు ప్రారంభించింది …తమ శాఖలు ముట్టుకుంటే షాకులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు మంత్రులు… అసలే ఉన్న రెండు మూడు రాష్ట్రాల్లో ఇదొకటి రాకరాక వచ్చిన అధికారం తప్పటడుకు వేస్తె మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు ..

ఒక సందర్భంలో పార్టీ ఆలోచన ప్రకారం డిప్యూటీ సీఎం భట్టికి హోమ్ ,దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆర్థికం ,తుమ్మల నాగేశ్వరరావుకు భారీనీటిపారుదల శాఖలను అప్పగించాలని భావించినప్పటికీ మంత్రుల నుంచి వచ్చిన వత్తిడి ఫలితంగా మార్పుకు తాత్కాలిక బ్రేక్ లు వేసినట్లు సమాచారం .. రాష్ట్రరాజదానిలో జరుగుతున్న ప్రచారం హైకమాండ్ వద్దకు చేరడం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఇటీవల జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కొందరితో వన్ టు వన్ కూడా మాట్లాడారు … ఒక అభిప్రాయానికి వచ్చారు …పార్టీకి నివేదిక ఇచ్చారు …మంత్రుల శాఖలు మారుతున్నాయని సమాచారం అందటంతో మంత్రులు అలర్ట్ అయ్యారు…తమ శాఖలు మార్పుకు ససేమీరా అన్నారు …ప్రస్తుతానికి మార్పు లేకుండానే బండి నడిపించాలని నిర్ణయానికి వచ్చారు …

దీంతో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్‌కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖల బాధ్యతలను అప్పగించారు….ఇదే సందర్భంలో కాబినెట్ లో శాఖల మార్పుపై కూడా ద్రుష్టి సారించారు …తమ శాఖల మార్పును అంగీకరించేందుకు మంత్రులు సిద్ధంగాలేరు …ఒక మంత్రి తమ దగ్గర ఉన్న కీలక శాఖ మారుతుందని హుటాహుటిన ఢిల్లీకి పరుగులు తీశారు …ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై తమ అసమ్మతిని తెలియజేశారు ..అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో శాఖల మార్పుపై చర్చించిన అధిష్టానం మంత్రుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో తాత్కాలికంగా పక్కన పెట్టారు ..దీంతో ఢిల్లీలో సీఎం మీడియాతో మాట్లాడుతూ శాఖల మార్పు లేదని తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు … కొద్దిసేపటికే కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. దీంతో తమ శాఖలు మారతాయని భావించిన మంత్రులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు …

రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువు తీరిన సర్కార్ కు ఏడాదిన్నర అయింది … ఒక పక్క రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య సంఖ్యత ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా కోల్డ్ వార్ జరుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి… …ఏఐసీసీ కి ఫిర్యాదులమీద ఫిర్యాదులు ,లేఖలమీద లేఖలు వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం …కొత్తగా మంత్రులకు శాఖలు కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలనే ఆలోచనతో అటు అధిష్టానం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు వస్తున్న వార్తలు కొందరు మంత్రులను ఉలిక్కి పడేలా చేశాయి…డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దనున్న ఆర్థికశాఖను మార్చి హోమ్ మంత్రి ఇస్తారని ప్రచారం జరిగింది …అదే విధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ శాఖలు మారబోతున్నాయని గుసగుసలు బయలుదేరాయి…తుమ్మల వ్యవసాయశాఖ మార్చిఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన భారీ నీటిపారుదల శాఖ ఇస్తారని , భట్టి దగ్గర ఉన్న ఆర్దికశాఖను శ్రీధర్ బాబు కు , పొంగులేటి దగ్గర ఉన్న సమాచారశాఖను పొన్నం ప్రభాకర్ కు ఇస్తారని ప్రచారం జరిగింది …దీంతో కంగారు పడ్డ మంత్రులు తమ మార్గాల్లో హైకమాండ్ కు తమ అసంతృప్తిని తెలిపారు …ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు …భట్టికి కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరిగిన ఆయన హైద్రాబాద్ లోనే ఉన్నారు … మంత్రివర్గంలో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉండగా కేవలం మూడు మాత్రమే భర్తీ చేశారు …అదికూడా ఇద్దరు ఎస్సీ ,ఒక బీసీకి ఇచ్చారు … మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , మాల్ రెడ్డి రంగారెడ్డి , సుదర్శన్ రెడ్డి ,ప్రేమ్ సాగర్ రావుల నుంచి అలకలు, అగ్రహాలు ,అసంతృప్తులు ,పెల్లుబికాయి…. రంగంలోకి దిగిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్ ,సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి రంగంలోకి దిగారు ..వారిని బుజ్జగించారు ..ఈసారి వచ్చే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు …ఎట్టకేలకు అసంతృప్తులు ,అలకలు తాత్కాలికంగా చల్లబడ్డాయి… రానున్న రోజుల్లో ఏది కదిపినా షాక్ కొట్టేలా ఉంది …అధిష్టానం ఆచితూచి అడుగులు వేయకపోతే పుట్టిమునగడం ఖాయం …తస్మాత్ జాగ్రత్త …!

Related posts

ఉపఎన్నికలు వస్తాయి ..స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి ఓటమి ఖాయం: కేసీఆర్

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లీగల్ నోటీసులు

Ram Narayana

బీజేపీకి 30 సీట్ల వరకు వస్తాయి… సంకీర్ణ రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలి: ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana