కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ప్రారంభం
గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులకు మంచి డెన్ గా ,కంచుకోటగా మారిన కర్రె గుట్టలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ప్రారంభం మైంది .మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ముఖ్యనేతలు ఎదురు కాల్పుల్లో చనిపోవడమో లేదా లొంగిపోవడంతో వారి సానుభూతి పరులుగా ఉన్న వారు సైతం తమకెందుకులే అన్నట్లు ఉండటంతో పోలీసులు కర్రెగుట్టల ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు ..అయితే ఇప్పటికి ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఆయుధాలు దాచి ఉంటారని గాలింపు చర్యలు చేస్తున్నారు ..
వాజేడు మండలం మురుమూరు గ్రామం నుంచి సుమారు 15 కిలోమీటర్ల గుట్టలు, లోయలను చదును చేస్తూ కర్రెగుట్టల్లోని పామునూర్ గ్రామం వద్దకు రహదారి నిర్మించారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌ను సౌత్ సెక్టార్ ఐజీ విక్రమ్ ప్రారంభించారు. కర్రెగుట్టలో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని కర్రెగుట్టలపై ఏర్పాటు చేసిన మొదటి బేస్ క్యాంపు ఇదేనని ఐజీ విక్రమ్ తెలిపారు.