జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ )అండ
ఇటీవల మృతి చెందిన మద్దెల శ్రీనివాస్
66 రూపాయల నగదును కుటుంబసభ్యులకు అందించిన మహబూబాబాద్ జర్నలిస్టులు
శ్రీనివాస్ కు ఘనమైన నివాళులు ..


దివంగత జర్నలిస్ట్ మద్దెల శ్రీనివాస్ కుటుంబానికి రూ.66 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా యూనిట్…
శ్రీనివాస్ చిత్రపటం ఎదుట నివాళులుఅర్పించి, మౌనం పాటించిన జర్నలిస్ట్ లు…
దివంగత శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అందే ప్రతి సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చిన టియుడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్రప్రధానకార్యదర్శి రాంనారాయణ…
జర్నలిస్ట్ లకు మహబూబాబాద్ జిల్లాలో ఆపద వచ్చిన ప్రతి సందర్భంలోనూ మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ…
శ్రీనివాస్ లేని లోటు ఆ.. కుటుంబానికి తీర్చలేనిదే అయినా మేమంతా ఆయన మిత్రులుగా.., మీ.. కుటుంబసభ్యులుగా ఉంటామని చెప్పడానికే ఈరోజు వచ్చామన్న టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్…
దివంగత జర్నలిస్ట్ మద్దెల శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధిక చేయూతను అందించాలని కోరగానే స్పందించి, అక్షరాల అరవైఆరువేల (66,000/-) రూపాయలను మానవతా హృదయంతో నాకు డబ్బులు పంపించిన మంచి మనుష్యులకు, మీ..మంచిమనుసులకు శిరస్సువంచి నమస్కరిస్తున్నానని దాతలందరికీ దన్యవాదాలు తెలిపిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్…
ఈ..కార్యక్రమంలో పాల్గొన్న టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్రఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, జాతీయకౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్, జిల్లాకోశాధికారి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మగాని మధు, ఖమ్మం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లానాయకులు కృష్ణ, గాడిపల్లి యాదగిరి, చందా శ్రీనివాస్, బేతమల్లు సహదేవ్, విజయ్, అశోక్, శ్రీరామగిరి సర్పంచ్ ప్రశాంత్, నెల్లికుదురు మండల జర్నలిస్ట్ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు…