అంతర్జాతీయం

తొలి గ్రామీ అవార్డుతో చరిత్ర సృష్టించిన దలైలామా!

  • ‘మెడిటేషన్స్’ అనే స్పోకెన్-వర్డ్ ఆల్బమ్‌కు ఈ పురస్కారం
  • ఈ విభాగంలో ట్రెవర్ నోవా, జస్టిస్ కెటాంజీ బ్రౌన్ జాక్సన్‌లను అధిగమించిన వైనం
  • ఇదే వేడుకలో ‘ఈగాట్’ క్లబ్‌లో చేరిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ 
  • కె-పాప్ డెమోన్ హంటర్స్ బృందానికి కూడా అవార్డు

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా అరుదైన ఘనత సాధించారు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డును తొలిసారి గెలుచుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో ఫిబ్రవరి 1న జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన రూపొందించిన ‘మెడిటేషన్స్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ దలైలామా’ అనే స్పోకెన్-వర్డ్ ఆల్బమ్‌కు గాను ‘బెస్ట్ ఆడియో బుక్, నరేషన్ & స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్’ విభాగంలో ఈ అవార్డు లభించింది.

ఈ అవార్డు కోసం జరిగిన పోటీలో దలైలామా.. ప్రముఖ వ్యాఖ్యాత ట్రెవర్ నోవా, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కెటాంజీ బ్రౌన్ జాక్సన్, నటి కేథీ గార్వర్ వంటి ప్రముఖులను అధిగమించడం విశేషం. ఈ ఆల్బమ్‌లో మానసిక ప్రశాంతత, సామరస్యం, ఆరోగ్యం వంటి అంశాలపై దలైలామా చేసిన ప్రసంగాలను పొందుపరిచారు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత స్ఫూర్తితో రూపొందించిన ఈ ఆల్బమ్‌లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. “శాంతి అనేది మతపరమైన విషయం కాదు, అది మన మనుగడకు అవసరం” అని ఓ ట్రాక్‌లో ఆయన పేర్కొన్నారు. గతంలో ఒకసారి నామినేట్ అయినప్పటికీ, గ్రామీని గెలవడం ఆయనకు ఇదే మొదటిసారి.

ఇదే వేడుకలో మరికొందరు ప్రముఖులు కూడా తొలిసారి పురస్కారాలు అందుకున్నారు. దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘మ్యూజిక్ బై జాన్ విలియమ్స్’ అనే డాక్యుమెంటరీకి గాను బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ విభాగంలో గ్రామీ గెలుచుకున్నారు. దీంతో ఆయన ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ (EGOT) అవార్డులన్నీ గెలిచిన అరుదైన క్లబ్‌లో చేరారు. మరోవైపు కె-పాప్ బృందం ‘డెమోన్ హంటర్స్’కు చెందిన ‘గోల్డెన్’ పాటకు ‘బెస్ట్ సాంగ్ రిటెన్ ఫర్ విజువల్ మీడియా’ విభాగంలో అవార్డు లభించింది. ఇది కె-పాప్ సృష్టికర్తలకు ప్రపంచ వేదికపై లభించిన ముఖ్యమైన విజయంగా నిలిచింది.దలైలామాకు గ్రామీ అవార్డు.. తీవ్రంగా స్పందించిన చైనా

Dalai Lama wins Grammy Award China reacts strongly
  • 90 ఏళ్ల వయస్సులో మెడిటేషన్ అనే ఆల్బమ్‌కు అవార్డు
  • దలైలామా పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యక్తి కాదన్న చైనా
  • చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ

దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. దీనిని ఉపయోగించుకుని చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.

దలైలామా పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యక్తి కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఓ మీడియా సమావేశంలో అన్నారు. మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని ఆయనపై ఆరోపణలు గుప్పించారు.

ఈ అవార్డును బీజింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ఒక సాధనంగా ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దలైలామా మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే వ్యక్తి అన్నారు.

తనకు గ్రామీ అవార్డు రావడంపై దలైలామా స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా చూడటం లేదని అన్నారు. శాంతి, కరుణ, పర్యావరణంపై శ్రద్ధ, మానవత్వం అనేవి మానవాళి శ్రేయస్సుకు అవసరమని పేర్కొన్నారు. గ్రామీ గుర్తింపు ఈ సందేశాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.

Related posts

హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి బతికే ఉంది!

Ram Narayana

కొరియన్ యువతులే టార్గెట్… ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష!

Ram Narayana

కాబోయే భార్యకు అమెజాన్ అధినేత రూ.560 కోట్లతో గిఫ్ట్

Ram Narayana