ఏపీ అసెంబ్లీ సమావేశాలు

శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్…

  • విశాఖలో సంస్థలకు భూకేటాయింపులపై చర్చ
  • విలువైన భూములను అతి తక్కువ ధరకు ఎలా కేటాయిస్తారని వైసీపీ ప్రశ్న
  • 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్న లోకేశ్
  • గీతంకు భూ కేటాయింపులపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ వాకౌట్

విశాఖలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించడంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. రియలెస్టేట్ కంపెనీలకు స్థలాలు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నించింది. దీనిపై మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఏపీకి కంపెనీలు రావడం వైసీపీకి నచ్చదని నారా లోకేశ్ విమర్శించారు. విశాఖలో ఎకో సిస్టమ్ తయారుచేయాలంటే పెద్ద కంపెనీలు రావాలని… అందుకే ఐదు కంపెనీలకు భూములు లీజుకిచ్చామని తెలిపారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ఇతర రాష్ట్రాల్లో కోట్లు పెట్టి కంపెనీలు భూములు కొంటుంటే… విశాఖలో విలువైన భూములను అతి తక్కువ ధరకే అప్పగిస్తున్నారని విమర్శించారు. గీతం యూనివర్శిటీకి రూ. 5 వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బొత్స అన్నారు. గీతంకు భూముల కేటాయింపును నిరసిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ… వైసీపీకి వాకౌట్ చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ తలుపు నుంచి వచ్చి ఆ తలుపు నుంచి వెళ్లిపోవడం బొత్స సత్యనారాయణకు అలవాటేనని అన్నారు.

Related posts

మండలిలో లోకేశ్ వర్సెస్ బొత్స!

Ram Narayana

ఏడు బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ అసెంబ్లీ!

Ram Narayana

మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే: అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో బొత్స!

Ram Narayana