తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ ఆఫర్ కు సిపిఐ నో చెప్పనుందా …?

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం బీఆర్ యస్ ఇచ్చిన ఆఫర్ కు సిపిఐ నో చెప్పనుందా …? అంటే.. యస్ అనే సమాధానమే వస్తుంది …అదే మేయర్ పీఠం కాంగ్రెస్ కూడా ఇచ్చేందుకు సిద్దపడటంతో సహజంగానే మిత్రపక్షంగా ఉండటమే గాక , ఇండియా కూటమిలో సిపిఐ ఉండటం ,మరో మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కనుక కాంగ్రెస్ ఆఫర్ కు సిపిఐ ఒకే చెప్పనున్నదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం..

అటు బీఆర్ యస్ ఇటు కాంగ్రెస్ స్నేహ హస్తం అందించడానికి ముందుకు రావడంతో సిపిఐ దారెటు ..మిత్రపక్షమైన కాంగ్రెస్ తో కలిసి ఉండటమా లేక బీఆర్ యస్ భేషరత్ ఆఫర్ ను అంగీకరించడమా ..?అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది …60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ, కాంగ్రెస్ సమానంగా చేరి 22 డివిజన్లు గెలుచుకున్నాయి…బీఆర్ యస్ 8 డివిజన్లు , ఆరుగురు ఇండిపెండెంట్లు , ఒక సిపిఎం ,ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందారు ..దీంతో హంగ్ ఏర్పడింది .. తమ బలాన్ని బలగాన్ని తక్కువ అంచనా వేయవద్దని ఛాలంజ్ చేసి ఒంటరిగా పోటీచేసి 22 సీట్లు గెలుచుకొని సిపిఐ కింగ్ గా నిలిచింది … దీంతో సిపిఐ కి బీఆర్ యస్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం , సీఎం జోక్యం చేసుకోవడం కీలకమైన పరిణామాలుగా మారాయి…

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి బేషరత్ గా మద్దతు ఇస్తామని తెలిపారు ..అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి మనం మనం మిత్రులం కలిసి పనిచేద్దామని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని అన్నట్లు తెలుస్తుంది …దీంతో సిపిఐ డైలమాలో పడింది ..కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయడమా …?లేక బీఆర్ యస్ ఆఫర్ కు అంగీకరించడమా…? అనే దానిపై తర్జన భర్జనలు పడుతుంది . సిపిఐ జాతీయ నాయకత్వం వద్దకు కూడా సమస్య వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది ..సిపిఐ ఇండియా కూటమిలో ఉన్నందున దేశ రాజకీయాల దృష్ట్యా జాతీయ నాయకత్వం సూచనల మేరకు నడుచుకునే అవకాశం ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ..

రెండు సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ సీటు సిపిఐ కి కాంగ్రెస్ పొత్తులో భాగంగా కేటాయించింది ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు ..ఇప్పటివరకు మిత్ర ధర్మాన్ని పాటించి ఆయన శాసనసభ లోపల బయట కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా తన గళం వినిపిస్తున్నారు ..అయితే స్థానిక ఎన్నికల్లో సిపిఐ -కాంగ్రెస్ లమధ్య సయోధ్యలేకుండా పోయింది.సర్పంచ్ ఎన్నికల్లో వేరు వేరుగా పోటీచేశారు ..అదే విధంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విడివిడిగా పోటీచేశారు …

కొత్తగూడెంలో ఓడిపోలేదు.. పొంగులేటి

కొత్తగూడెంలో గెలిచి తీరుతామని విశ్వాసం తో ఉన్న మంత్రి పొంగులేటి ఫలితాలు ప్రతికూలంగా రావడం , సిపిఐకి బీఆర్ యస్ ఆఫర్ ఇవ్వడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు ..కొత్తగూడెం లో తాము ఓడిపోలేదని ..తమ మిత్రపక్షం సిపిఐ తో స్నేహపూర్వక పోటీ జరిగిందని వారికి మాకు కలిపి 45 డివిజన్లు వచ్చాయని అన్నారు ..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు..కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య స్నేహపూర్వక పోటీ జరిగిందని చెప్పారు..కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి అక్కడ 45 డివిజన్లలో విజయం సాధించాయని, సీపీఐ తమ మిత్ర పక్షమని పొంగులేటి వ్యాఖ్యానించారు.

చక్రం తిప్పిన సీఎం …

సీఎం రంగ ప్రవేశంతో పొత్తు ధర్మం పాటించి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి సీపీఐకి కేటాయించనున్నట్లు సమాచారం ..డిప్యూటీ మేయర్ పదవితో కాంగ్రెస్ సరిపెట్టుకుంటుందని సమాచారం ..ఈ మేరకు సీఎం చక్రం తిప్పినట్లు తెలుస్తుంది .. కేటీఆర్ ఆఫర్ కు కృతజ్ఞతలు చెపుతూనే సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం …

Related posts

ఎమ్మెల్యేల రహస్య భేటీ…కాంగ్రెస్ లో పరేషాన్…రంగంలోకి సీఎం రేవంత్ !

Ram Narayana

కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Ram Narayana

పదవి లేకున్నా ప్రజాసేవే అంటున్న రాజగోపాల్ రెడ్డి

Ram Narayana