ఖమ్మం వార్తలు

“పవన్ కళ్యాణ్ హఠావో ,పాలిటిక్స్ బచావో” పుస్తక రచయత అనుమానాస్పద మృతి

“పవన్ కళ్యాణ్ హఠావో ,పాలిటిక్స్ బచావో” పుస్తక రచయత అనుమానాస్పద మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది.“పవన్ కళ్యాణ్ హఠావో” పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పాలేరు కాలువలోకి కారు దూసుకెళ్లగా… వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతిచెందినట్టు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.2014లో “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పేరుతో పుస్తకం రాసి అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశారు. ఆ సమయంలో బెదిరింపులు ఎదుర్కొని, అరెస్టు కూడా అయ్యారు.ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది సాధారణ ప్రమాదమా? లేక మరేదైనా కోణం ఉందా?

ఇతను కర్నూల్ జిల్లాకు చెందిన వారు ..అయితే ఇటు ఎందుకు వచ్చారు ..హైవే ఉండగా కారు పాలేరు చెరువు రోడ్ కు ఎందుకు వెళ్ళింది అనేది మిస్టరీగా మారింది ..కారు డ్రైవర్ చనిపోయిన వ్యక్తిని వదిలి ఎందుకు పారిపోయాడు ..నిజంగా ఆక్సిడెంట్ నా లేక ముందుగానే చంపి బాడీని పాలేరు చెరువులో వేసేందుకు తెచ్చారా అనేది తేలాల్సి ఉంది ..

Related posts

శివయ్య సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..

Ram Narayana

ఐజేయు జాతీయ కౌన్సిల్ కు ఖమ్మం జిల్లా నుంచి ,రామ్ నారాయణ, వెంకటరావు

Ram Narayana

ఖమ్మాన్ని ముంచిన మున్నేరు …జలదిగ్బంధనంలో పలు కాలనీలు

Ram Narayana