జాతీయ వార్తలు

నియోజకవర్గాల పునర్విభజన… 543 నుంచి 850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు…

Delimitation Bill Lok Sabha Seats to Increase from 543 to 850
  • ఈ నెల 16న పార్లమెంటులో పునర్విభజన, మహిల్ రిజర్వేషన్ బిల్లులు
  • బిల్లులకు సంబంధించి ఎంపీలకు సమాచారం
  • రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు సీట్లు పెరిగే అవకాశం

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 16న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. బిల్లులకు సంబంధించిన ప్రతులను పంపించింది.

పునర్విభజన బిల్లు ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశముంది. దీనితో లోక్ సభ స్థానాలు 543 నుంచి 850కి చేరవచ్చని అంచనా ఉంది. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది.

సీట్ల పెంపు తర్వాత దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్ సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత లోక్‌సభ సీట్లు: 543
పెరుగుదలకు అవకాశం 815 నుండి 850 వరకు
మొత్తం పెరుగుదల సుమారు +270 నుండి +300 సీట్లు ఉండవచ్చు ..

చాలా రాష్ట్రాలకు సుమారు 50% వరకు సీట్లు పెరుగుతాయి
రాష్ట్రాల వారీగా పెరుగుదల అంచనా

ఉత్తరప్రదేశ్ లో +20 నుండి +40 సీట్లు
బిహార్ +10 నుండి +25 సీట్లు
రాజస్థాన్ +6 నుండి +15 సీట్లు
మధ్యప్రదేశ్ +5 నుండి +15 సీట్లు

సెంట్రల్ ఇండియా
మహారాష్ట్ర సుమారు +15 నుండి +25 సీట్లు
గుజరాత్ +5 నుండి +10
హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ +2 నుండి +10

ఆంధ్రప్రదేశ్: 25 → ~35–38
తెలంగాణ: 17 → ~25–26
తమిళనాడు, కేరళ, కర్ణాటక:
సీట్లు పెరిగినా
పార్లమెంట్‌లో వాటా (share) కొంత తగ్గవచ్చు
చిన్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు
సిక్కిం
మిజోరం
నాగాలాండ్

ఇవి ప్రస్తుతం 1 సీటు మాత్రమే ఉన్న రాష్ట్రాలు కావడంతో
పెరుగుదల ఉండకపోవచ్చు

మొత్తం పెరుగుదల సుమారు 300 సీట్లు
ఎక్కువ రాష్ట్రాలు ~50% పెరుగుదల
ఉత్తర భారతం: ఎక్కువ లాభం పడుతుండగా
దక్షిణ భారతంకు అన్యాయం జరుగుతుంది ..దీనిపై ఇప్పటికే దక్షణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తుంది … నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మోడీ కే కి లేఖ రాయగా , తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటం తప్పడం హెచ్చరించారు …

Related posts

హర్యానాలో హింస.. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి!

Ram Narayana

టెర్రర్‌ కేసు దోషితో తల్లి పెళ్లి.. తనయుడిని ఉగ్రవాదిగా మార్చేందుకు యత్నం…

Ram Narayana

కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే కీలక నేత అరెస్ట్…

Ram Narayana