Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

పాకిస్థాన్‌‌లోని సదస్సుకు నరేంద్రమోదీ వస్తే సంతోషించేవాడిని: నవాజ్ షరీఫ్

  • పాక్‌లో ఎస్సీవో సదస్సుకు హాజరైన జైశంకర్
  • జైశంకర్ రాక సానుకూల పరిణామమన్న నవాజ్ షరీఫ్
  • మరో 75 ఏళ్లు నష్టపోవద్దన్న నవాజ్ షరీఫ్

షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ వస్తే బాగుండేదని… తాను మరింత సంతోషించేవాడినని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ సదస్సుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరయ్యారు. జైశంకర్ హాజరు కావడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఇది సానుకూల పరిణామం అన్నారు. ఇరుదేశాలు మరో డెబ్బై ఐదు సంవత్సరాలు నష్టపోరాదని అభిప్రాయపడ్డారు.

గతాన్ని పక్కనపెట్టి ఇంధనం, వాతావరణ మార్పుల వంటి భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించుకోవాలన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య చాలాకాలంగా నిలిచిపోయిన శాంతిచర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు పురోగతి సాధించాలంటే ఉద్రిక్తతలు ఉండరాదన్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై స్పందిస్తూ… చర్చలను ఎక్కడ ఆపేశామో… అక్కడి నుంచి తిరిగి ప్రారంభించాలన్నారు.

Related posts

ఇదొక విచిత్రమైన విమాన సర్వీసు… కేవలం ఒకటిన్నర నిమిషంలో ప్రయాణం పూర్తవుతుంది!

Ram Narayana

అమెరికాలో కొత్త పద్ధతిలో మరణ శిక్ష.. ఇదే అత్యంత మెరుగైన విధానమట!

Ram Narayana

 సంప్రదాయాన్ని బద్దలుగొట్టిన సౌదీ అరేబియా.. తెరుచుకోబోతున్న మద్యం దుకాణం

Ram Narayana

Leave a Comment