సినిమా వార్తలు

శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నాం: అల్లు అరవింద్

  • సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్
  • శ్రీతేజ్ కోలుకుంటున్నాడన్న అల్లు అరవింద్
  • రూ. 2 కోట్ల చెక్కులను దిల్ రాజుకు అందించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ‘పుష్ప-2’ టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను, ఆయన తండ్రిని పరామర్శించారు. 

అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ… శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, ‘పుష్ప-2’ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని… ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.

Related posts

అల్లు అర్జున్.. మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా ఉంది: ప్ర‌కాశ్ రాజ్‌

Ram Narayana

ఇండస్ట్రీ బహిష్కరించినా బాధ లేదు: పోసాని సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవికి కాంగ్రెస్ నేతల వార్నింగ్…

Drukpadam