ఆంధ్రప్రదేశ్

అమరావతిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటికి భూమిపూజ!

  • సచివాలయం వెనుక వెలకపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు ఇల్లు
  • భూమి పూజకు హాజరైన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
  • 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో ఇంటి నిర్మాణం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో కట్టుకుంటున్న సొంత ఇంటికి భూమిపూజ జరిగింది. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

సచివాలయం వెనుక E9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నివాసంతో పాటు, పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటిని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో నిర్మించనున్నారు. ఏడాదిన్నర సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

ఇవిగో ఫొటోలు

Chandrababu Naidus New House Groundbreaking Ceremony in Amravati

రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, మంత్రి నారా లోకేశ్‌, ఆయ‌న అర్ధాంగి బ్రాహ్మ‌ణీ, వారి కుమారుడు దేవాంశ్ భూమిపూజలో పాల్గొన్నారు. 

Related posts

 ఏపీలో సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ .. త్వరలో అమలులోకి!

Ram Narayana

 సీఎం జగన్‌తో అవినాశ్‌ రెడ్డి భేటీ

Ram Narayana

జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ: చంద్రబాబు మండిపాటు..!

Drukpadam