జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక స్టేట్ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది..
గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రులు, జూబ్లీహిల్స్ బైపోల్ ఇన్ చార్జిలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో లంచ్ మీట్ ఏర్పాటు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని గెలిచి తీరాల్సిందేనని నేతలకు దిశానిర్దేశం చేశారు.

