అంతర్జాతీయం

నలుగురు మయన్మార్ మాఫియా సభ్యులను ఉరితీసిన చైనా…

  • మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో శిక్ష అమలు
  • ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది ఉరిశిక్ష విధించిన కోర్టు
  • శిక్షను అమలు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడి

మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా నలుగురికి చైనాలో ఉరిశిక్ష అమలు చేశారు. ఈ మేరకు బాయి ఫ్యామిలీ మాఫియాకు చెందిన నలుగురికి ఉరిశిక్ష అమలు చేసినట్లు షెంజెన్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు వెల్లడించింది. హత్యలు, టెలికాం మోసం, డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది కోర్టు ఈ శిక్ష విధించింది. తాజాగా దానిని అమలు చేసింది.

ఆన్‌లైన్ మోసాలతో పాటు వివిధ కేసులు ఎదుర్కొంటున్న ఈ గ్యాంగులపై చైనా కొంతకాలంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మయన్మార్‌కు చెందిన నేర ముఠాకు చెందిన సభ్యులకు మరణశిక్షను అమలు చేసినట్లు ఇటీవల స్థానిక మీడియా పేర్కొంది.

వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ మాఫియా, తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలను తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ముఠాలోని నలుగురికి శిక్షను అమలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ శిక్షను ఎప్పుడు అమలు చేశారనేది తెలియరాలేదు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు కిడ్నాప్.. పాకిస్థాన్ లో రాజకీయ ప్రకంపనలు!

Ram Narayana

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ‘‘నమస్తే మోదీ’’ అంటూ ఇజ్రాయెల్ పత్రిక స్వాగతం…

Ram Narayana

ప్లూటోను అధికారిక గ్రహంగా ప్రకటించిన అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం

Ram Narayana