వెన్నం సోదరులను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి పట్ల సంతాపం..
వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం..
జనసంద్రంగా మారిన రెడ్యాల..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఈ నెల 11 న వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రెడ్యాల గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెన్నం సోదరులైన TPCC రాష్ట్ర మాజీ కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి మరియు BIG TV గ్రూప్ ఆఫ్ చైర్మన్ వెన్నం విజయ్‌లను ప్రత్యేకంగా కలిసి ఓదార్చారు.
సీఎం పర్యటన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామ ప్రజలు కూడా సీఎం రాకతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.వెన్నం రాఘవేందర్ రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.సిఎం రాక తో రెడ్యాల గ్రామ జనసంద్రంగా మారింది.సీఎం వెంట..మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ ,వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే లు మురళి నాయక్,రామ్ చంద్రు నాయక్,ఎంపీ బలరాం నాయక్, పాల్గొన్నారు.