పవన్ కళ్యాణ్ హఠావో“ బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ
రచయిత బొగ్గుల శ్రీనివాస్ ను హత్య చేసిన సుపారీ గ్యాంగ్
ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కూసుమంచి పోలీసులు
ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని.. దర్యాప్తులో తేల్చిన ఖమ్మం పోలీసులు
నార్కట్ పల్లి – నకిరేకల్ మధ్య శ్రీనివాస్ ను హత్య చేసినట్లు గుర్తింపు
పాలేరు రిజర్వాయర్లో మృతదేహం పడేసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, హత్యకు ఎటువంటి సంబంధం లేదన్న పోలీసులు
బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును చేదించిన కూసుమంచి పోలీసులు
రచయిత, యూ ట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల వివాదమే శ్రీనివాస్ దారుణ హత్యకు దారి తీసినట్లు చెప్పారు. అశ్వరావుపేటకు చెందిన సుపారీ ముఠా శ్రీనివాస్ ను కత్తులతో పొడిచి, ఇనుపరాడ్లతో కొట్టి చంపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యోదంతానికి, పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏసీపి తిరుపతిరెడ్డి కథనం ప్రకారం.. బొగ్గుల శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పూర్తి వివరాల్లోకి వెడితే..
బొగ్గుల శ్రీనివాస్ హైదరాబాద్ లో నివసిస్తూ యూ ట్యూబర్ గా, రచయితగా ప్రాచుర్యం పొందాడు. యూ ట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లలో వీడియోలు చేస్తుండేవాడు. శ్రీనివాస్ తో పాటు మేకల వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన సందర్భంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్ కు BOGGULA BBQ పేరుతో GST లైసెన్స్ ఉండగా, వేణుమాధవ్ రెడ్డి ‘మేకా ప్రాజెక్ట్స్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు.
బొగ్గుల శ్రీనివాస్ హైదరాబాద్ లో నివసిస్తూ యూ ట్యూబర్ గా, రచయితగా ప్రాచుర్యం పొందాడు. యూ ట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లలో వీడియోలు చేస్తుండేవాడు. శ్రీనివాస్ తో పాటు మేకల వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన సందర్భంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్ కు BOGGULA BBQ పేరుతో GST లైసెన్స్ ఉండగా, వేణుమాధవ్ రెడ్డిబొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును చేదించిన కూసుమంచి పోలీసులు
రచయిత, యూ ట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల వివాదమే శ్రీనివాస్ దారుణ హత్యకు దారి తీసినట్లు చెప్పారు. అశ్వరావుపేటకు చెందిన సుపారీ ముఠా శ్రీనివాస్ ను కత్తులతో పొడిచి, ఇనుపరాడ్లతో కొట్టి చంపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యోదంతానికి, పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏసీపి తిరుపతిరెడ్డి కథనం ప్రకారం.. బొగ్గుల శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పూర్తి వివరాల్లోకి వెడితే..
బొగ్గుల శ్రీనివాస్ హైదరాబాద్ లో నివసిస్తూ యూ ట్యూబర్ గా, రచయితగా ప్రాచుర్యం పొందాడు. యూ ట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లలో వీడియోలు చేస్తుండేవాడు. శ్రీనివాస్ తో పాటు మేకల వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన సందర్భంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్ కు BOGGULA BBQ పేరుతో GST లైసెన్స్ ఉండగా, వేణుమాధవ్ రెడ్డి ‘మేకా ప్రాజెక్ట్స్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు.
అయితే ఇందుకు రూ. కోటి పైనే జీఎస్టీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితుల కారణంగా శ్రీనివాస్, వేణుమాధవ్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు, వివాదాలు తలెత్తాయి. ఆర్థిక ఒత్తిడికి BOGGULA BBQ కంపెనీ జీఎస్టీ లైసెన్స్ తిరిగి యాక్టివేట్ చేయించడం, కోటి రూపాయల జరిమానా భారం తదితర అంశాలు తోడవడంతో వేణుమాధవ్ రెడ్డి మదిలో హత్య యోచన మెదిలింది. ఈమేరకు కుట్ర పన్నిన వేణుమాధవ్ రెడ్డి అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వర్ రావును, షేక్ అబ్దుల్ హఫీజ్ ను, మహ్మద్ అజ్మత్ ఆలీ ఖాన్ తో కలిసి శ్రీనివాస్ హత్యకు కుట్ర పన్నాడు.
కుట్ర అమలులో భాగంగా పోకల వెంకటేశ్వర్ రావు, అబ్దుల్ హపీజ్, ఆజ్మత్ ఆలీఖాన్ ముఠాకు రూ. 5.00 లక్షల మొత్తాన్ని వేణుమాధవ్ రెడ్డి సుపారీగా చెల్లించాడు. చెల్లించాల్సిన డబ్బును ఇస్తామంటూ ఈనెల 13వ తేదీన రాత్రి శ్రీనివాస్ ను ఆయా ముఠాతోపాటు వేణుమాధవ్ రెడ్డి నమ్మించారు. డబ్బుకోసం విజయవాడకు వెడదామని చెప్పి శ్రీనివాస్ ను కారులో తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు 14వ తేదీన తెల్లవారుజామున నకిరేకల్ నుంచి జనగామ వైపునకు వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో నిందితులు కత్తులు, ఐరన్ రాడ్లతో శ్రీనివాస్ తలపై కొట్టి, పొడిచి దారుణంగా హత్య చేశారు.
శ్రీనివాస్ ను ఈ విధంగా చంపిన తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకరచన చేశారు. ఇందులో భాగంగానే మృతదేహాన్ని కారులో తీసుకుని పాలేరు రిజర్వాయర్ లోకి పడేసి, అదుపుతప్పిన కారు ప్రమాద ఘటనగా నమ్మించేయత్నం చేశారు. అయితే మొత్తం ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే.. కారును రిజర్వాయర్ లోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సుపారీ ముఠా మాత్రం పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకోలేకపోవడం.
కాగా ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు జరిపిన కూసుమంచి సీఐ సంజీవ్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ఎస్ఐలు నాగరాజు, సంతోష్, జగదీష్, ప్రొబేషనరీ ఎస్ఐ దివ్యలను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు. అదేవిధంగా ఈ కేసులో సహకరించిన శ్రీకాంత్, సతీష్, వినయ్, ఉదయ్, పూర్ణచందర్ రావు, శ్రీశైలం, శ్రీలత, సయ్యద్, శోభన్, సీతారాములు, హోంగార్డు రాంబాబును ఏసీపీ ప్రశంసించారు. నాలుగు టీంలుగా దర్యాప్తును విజయవంతంగా పూర్తిచేసి, నిందితులను అరెస్ట్ చేసిన ఆయా అధికారులకు, సిబ్బందికి రివార్డులను కూడా ఏసీపీ అందించారు. ‘మేకా ప్రాజెక్ట్స్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు.
అయితే ఇందుకు రూ. కోటి పైనే జీఎస్టీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితుల కారణంగా శ్రీనివాస్, వేణుమాధవ్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు, వివాదాలు తలెత్తాయి. ఆర్థిక ఒత్తిడికి BOGGULA BBQ కంపెనీ జీఎస్టీ లైసెన్స్ తిరిగి యాక్టివేట్ చేయించడం, కోటి రూపాయల జరిమానా భారం తదితర అంశాలు తోడవడంతో వేణుమాధవ్ రెడ్డి మదిలో హత్య యోచన మెదిలింది. ఈమేరకు కుట్ర పన్నిన వేణుమాధవ్ రెడ్డి అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వర్ రావును, షేక్ అబ్దుల్ హఫీజ్ ను, మహ్మద్ అజ్మత్ ఆలీ ఖాన్ తో కలిసి శ్రీనివాస్ హత్యకు కుట్ర పన్నాడు.
కుట్ర అమలులో భాగంగా పోకల వెంకటేశ్వర్ రావు, అబ్దుల్ హపీజ్, ఆజ్మత్ ఆలీఖాన్ ముఠాకు రూ. 5.00 లక్షల మొత్తాన్ని వేణుమాధవ్ రెడ్డి సుపారీగా చెల్లించాడు. చెల్లించాల్సిన డబ్బును ఇస్తామంటూ ఈనెల 13వ తేదీన రాత్రి శ్రీనివాస్ ను ఆయా ముఠాతోపాటు వేణుమాధవ్ రెడ్డి నమ్మించారు. డబ్బుకోసం విజయవాడకు వెడదామని చెప్పి శ్రీనివాస్ ను కారులో తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు 14వ తేదీన తెల్లవారుజామున నకిరేకల్ నుంచి జనగామ వైపునకు వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో నిందితులు కత్తులు, ఐరన్ రాడ్లతో శ్రీనివాస్ తలపై కొట్టి, పొడిచి దారుణంగా హత్య చేశారు.
శ్రీనివాస్ ను ఈ విధంగా చంపిన తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకరచన చేశారు. ఇందులో భాగంగానే మృతదేహాన్ని కారులో తీసుకుని పాలేరు రిజర్వాయర్ లోకి పడేసి, అదుపుతప్పిన కారు ప్రమాద ఘటనగా నమ్మించేయత్నం చేశారు. అయితే మొత్తం ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే.. కారును రిజర్వాయర్ లోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సుపారీ ముఠా మాత్రం పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకోలేకపోవడం.
కాగా ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు జరిపిన కూసుమంచి సీఐ సంజీవ్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ఎస్ఐలు నాగరాజు, సంతోష్, జగదీష్, ప్రొబేషనరీ ఎస్ఐ దివ్యలను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు. అదేవిధంగా ఈ కేసులో సహకరించిన శ్రీకాంత్, సతీష్, వినయ్, ఉదయ్, పూర్ణచందర్ రావు, శ్రీశైలం, శ్రీలత, సయ్యద్, శోభన్, సీతారాములు, హోంగార్డు రాంబాబును ఏసీపీ ప్రశంసించారు. నాలుగు టీంలుగా దర్యాప్తును విజయవంతంగా పూర్తిచేసి, నిందితులను అరెస్ట్ చేసిన ఆయా అధికారులకు, సిబ్బందికి రివార్డులను కూడా ఏసీపీ అందించారు.